తాలూకా పోలీస్ స్టేషన్ అభివృద్ధి కోసం టిజి భరత్ రూ. 5 లక్షల విరాళం
కర్నూలు టౌన్, నవంబర్ 10, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు అభివృద్ధి కోసం టీజీవి సంస్థలు ఎప్పుడూ ముందుంటాయని ఆ సంస్థల ఛైర్మన్ టిజి భరత్ అన్నారు. సోమవారం కర్నూల్ తాలూకా పోలీస్ స్టేషన్ అభివృద్ధి కోసం టీజీవి సంస్థల తరుపున రూ. 5 లక్షలు విరాళం అందజేశారు. ఈ మేరకు మౌర్య ఇన్ లో టిజి భరత్ 5 లక్షల రూపాయల చెక్కును తాలూకా పోలీస్ స్టేషన్ సీఐకి అందజేశారు. ఈ సందర్భంగా టిజి భరత్ మాట్లాడుతూ కర్నూల్ ప్రజల కోసం, నగరం అభివృద్ధి కోసం తాము ఎప్పుడూ అండగా ఉండి సహకారం అందిస్తామని చెప్పారు.

By admin