మానవత్వం చాటుకున్న ఇస్వి పోలీసుస్టేషన్ ఎస్సై విజయలక్ష్మీ
నడవలేని వృద్దురాలికి సహాయపడిన పోలీసులు.
వృద్ధురాలిని పోలీంగ్ కేంద్రం వద్దకు చేతులతో ఎత్తుకుని వెళ్లిన ఎస్సై విజయలక్ష్మీ
కర్నూలు క్రైమ్, నవంబర్ 16, (సీమకిరణం న్యూస్) :
  ఆదోని మండల పరిధిలోని,  ధనాపురం గ్రామములో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నపుడు ఒక వృద్దురాలిని తన మనవడు బైక్ పై ఓటు వేయడానికి తీసుకొని రాగా,  నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలిని  ఇస్వి పోలీసుస్టేషన్ ఎస్సై విజయలక్ష్మీ చేతులతో ఎత్తుకుని  పోలీంగ్ కేంద్రం వద్దకు తీసుకుని వెళ్లి మానవత్వం చాటుకున్నారు.
సదరు పోలీసు సేవా గుణాన్ని చూసి గ్రామస్తులు, అక్కడి పోలింగ్ సిబ్బంది  అభినందించారు.

By admin