ప్రతి కుటుంబానికి 100 రోజులు  పని కల్పిస్తాం
హోళగుంద, నవంబర్ 17, ( సీమకిరణం న్యూస్) :
 గ్రామాలలో ఉండే ప్రతి కుటుంబానికి ఉపాధి హామీ పని కల్పిస్తామని డ్వామా అడిషనల్ పిడి బాలక్రిష్ణ రెడ్డి అన్నారు.మంగళవారం మండల పరిధిలోని తేర్నెకల్ గ్రామంలో గ్రామంలోని ప్రజలకు ప్రతి కుటుంబానికి ఉపాధి హామీ పని కల్పిస్తామని కావున ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పని కల్పిస్తామని ప్రతి ఒక్కరు పనికి రావాలని కోరారు.అనంతరం గ్రామ ప్రజలు మాట్లాడుతూ మాకు ఇంకా వ్యవసాయ పనులు ఉన్నాయని ఉపాధి హామీ పని వెళ్తే వచ్చే దినసరి సగటున కూలి గిట్టుబాటు కావడం లేదన్నారు.రోజుకు మాకు 500 రూపాయల కూలి వస్తుందాన్నారు.కావున మేము ఉపాధి హామీ పనులు కు రాలేక పోతున్నామన్నారు.అనంతరం వరిముక్కల గ్రామంలో హార్టికల్చర్ డ్రాగన్ ఫ్రూట్ తోటను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆదేయ్య ఎపిఓ లు కృష్ణమూర్తి మద్దిలేటి టెక్నీకల్ అసిస్టెంట్లు ఫెల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

By admin