భారత రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంధం
-: హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ ఎస్టీ న్యాయవాదుల ఫోరమ్‌ అధ్య క్షుడు వై.జయరాజు
కర్నూలు టౌన్, నవంబర్ 26 , (సీమ కిరణం న్యూస్) :
భారత రాజ్యాంగం అనేది ఒక పవిత్ర గ్రంధమని,రాజ్యాంగమే దేశానికి రక్షణ అని హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ,ఎస్టీ న్యాయ వాదుల ఫోరమ్‌ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది వై.జయరాజు అన్నారు. శుక్రవారం పాత బస్టాండ్‌లోని అంబేద్కర్ సర్కిల్‌లో జాతీయ రాజ్యాంగ దినోత్సవం/జాతీయ న్యాయ దినోత్సవాన్ని ఏపీ ఎ స్సీ, ఎస్టి లాయర్స్ ఫోరం సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ ఎస్టీ న్యాయవాదుల ఫోరమ్‌ అధ్య క్షుడు వై.జయరాజు మాట్లాడుతూ మనువాది మతోన్మాద నిరంకుశ, మెజారిటీ శక్తుల నుండి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్య లౌకిక శక్తులు ఐక్యం కావాలని  పిలుపునిచ్చారు.ప్రతి ఒక్కరూ రాజ్యాంగం ను  గౌరవించాలని, రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని, డాక్టర్. బి.ఆర్. అంబేద్కర్ గారు 60దేశాలు తిరిగి 2సంవత్సరాల 11నెలల, 18 రోజులు కష్టపడి రాజ్యాంగంను రచించడం జరిగిందన్నారు. 1949 నవంబర్ 26న ఆమోదించడం జరిగిందని,1950 జనవరి 26న అమలు లోకి వచ్చిందన్నారు. అంబే ద్కర్  125 వ జన్మదినోత్సవం సందర్భంగా మనదేశ ప్రధాని నరేంద్రమోడి  ప్రతి సంవత్సరం నవంబరు 26న రాజ్యాంగ దినోత్సవంను ఘనంగా జరుపుకోవాలని ప్రకటించారు. డా. బి. ఆర్.అంబేద్కర్  రాజ్యాంగాన్ని రచించి నేటికి 72 సంవత్సరాలు పూర్తయినప్పటికినీ చాలా మందికి అందులోని హక్కులు, బాధ్యతలు, చట్టాలు, న్యాయ స్థానాలు గురించి సరియైన అవగాహన లేదన్నారు.అందుకే ప్రతీ వ్యక్తి, ప్రతి ఇంటిలో భారత రాజ్యాంగం పుస్తకాన్ని మన భావి తరాలైన పిల్లల చేత తప్పకుండా చదివించాలన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.సుబ్బయ్య, ఫోరం నాయకులు మాదన్న, చంద్రుడు, పివి ప్రసాదరావు, నాగప్ప, దస్తగిరి, నాగముని, తిరుపతి, బంగి శ్రీను, పుల్లన్న, రవిరాజు, సొగరాజు మునయ్య సొగరాజు తదితరులు పాల్గొన్నారు.

By admin