విద్యార్థులతో అధిక ఫీజు వసూలు చేస్తున్న మౌంట్ కార్మెల్ స్కూలు యాజమాన్యం

– కరోనా పీరియడ్ కి కూడా ఫీసు వసూలు

– ప్రశ్నించిన ఏ ఐ ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుల పై దాడికి యత్నం

– కవరేజ్ కి వెళ్ళిన విలేకరుల పట్ల అనుచిత వ్యాఖ్యల కు
పాల్పడిన మౌంట్ కార్మెల్ యాజమాన్యం

– చోద్యం చూస్తున్న విద్యాధికారులు

– చర్యలు తీసుకోవాలంటూ స్థానిక ప్రజలు

– కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు

కోసిగి, డిసెంబర్ 01,( సీమకిరణం న్యూస్) : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా,ఎన్నో పథకాలతో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి అవసరమైన కార్యాచరణ చేస్తుంటే కొన్ని ప్రవేటు విద్యా సంస్థలు మాత్రం అధిక ఫీజు వసూలు చేస్తూ విద్యార్థుల పట్ల కర్క్రశంగా పప్రవర్తిస్తూ ఉన్నాయి.అలాంటి సంఘటనే కోసిగి మండలంలో జరిగింది.దేశంలో అక్షరాస్యతలో అత్యంత వెనకబాటు ప్రాంతమైన కోసిగిలో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. వివరాల్లోకి వెళితే మౌంట్ కార్మెల్ స్కూలు యాజమాన్యం విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, కరోనా సమయంలో పాఠశాల తరగతులు నిర్వహించకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కవరేజ్ కు వెళ్లిన మీడియాపై కవరేజ్ చేస్తున్న సమయంలో సెల్ఫోన్లు లాక్కుని ఇష్టం వచ్చిన దగ్గర చెప్పుకోవాలని, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోండని , పాఠశాల ఆవరణలో కవరేజ్ చేయకూడదంటూ మౌంట్ కార్మెల్ పాఠశాల యాజమాన్యం దురుసుగా ప్రవర్తించారు. అక్కడే ఉన్న ఏఐఎస్ఎఫ్ నాయకుల మీదకు వెళ్లి దాడి చేయడం కోసం ప్రయత్నించారు. దీంతో కోసిగి మండల విలేకరులు పాఠశాల ముందు ధర్నా చేశారు. విషయం కాస్తా పోలీసులకు తెలియడంతో సంఘటన స్థలానికి ఏఎస్ఐ నాగరాజు , కానిస్టేబుల్ భాస్కరులు పాఠశాల సిబ్బంది, మరియు విలేకరులతో మాట్లాడి ధర్నాలు విరమింపజేశారు. అనంతరం విలేకరులు స్థానిక పోలీస్ స్టేషన్లో మౌంట్ కార్మెల్ యాజమాన్యం పై ఫిర్యాదు చేశారు. విలేకర్ల పట్ల దురుసుగా ప్రవర్తించి అనుచిత వ్యాఖ్యలు చేసి , సెల్ఫోన్లు లాక్కున్న మౌంట్ కార్మెల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులు , విద్యార్థి సంఘం నాయకులు , ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పాఠశాలకు తాళం వేస్తామని హెచ్చరించారు. వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విలేకరులు వీరేష్ గోపాల్ , శ్రీరామ్ , హనుమేష్ , షబ్బీర్, కర్రెప్ప , మల్లి కార్జున ,ఏఐఎస్ఎఫ్ నాయకులు వీరేష్,రాజు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

By admin