డిసెంబర్ 12 న….అ‘పూర్వ’ కలయిక…..

పూర్వ విద్యార్థుల ఇదే తొలి ఆత్మీయ సమ్మేళనం…

ప్రతి ఒక్కరి చూపు వెల్దుర్తి…94 బ్యాచ్…వైపు…చూసే..దిశగా… పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం

వెల్దుర్తి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో
డిసెంబర్ 12న పూర్వ విద్యార్థుల తొలి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన పదవ తరగతి 1993 – 94 బ్యాచ్ పూర్వ విద్యార్థులు పాల్గొంటారు. 27 సంవత్సరాల తర్వాత తొలి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పూర్వ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో
పలువురు… మిత్రులు….(గెట్ టు గేదర్)…పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో…గురువులను…ఘన సన్మానించాలని.. అలాగే కార్యక్రమం విజయవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

డిసెంబర్ 12న జరిగే కార్యక్రమంలో కొన్ని….

1. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న సరస్వతి విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

2. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి వచ్చే గురువులకు పాఠశాల ప్రధాన ద్వారం నుండి పూలతో ఘన స్వాగతం పలుకుతారు.

3. విద్య బుద్ధులు నేర్పించిన గురువులను శాలువా కప్పి మెమొంటో అందజేసి పూలమాలలతో ఘన సన్మానం… చేస్తారు.

4. ఉపాధ్యాయుల ఆశీర్వాదం తీసుకోనున్న పూర్వ విద్యార్థులు

5. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కావలిసిన బీరువా వితరణగా అందించనున్నారు.

6. పూర్వ విద్యార్థులు అందరూ కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడం జరుగుతుంది…

7. మరణించిన తోటి పూర్వ విద్యార్థులకు…నివాళులు అర్పించి…ఆర్థిక సహాయం అందజేస్తారు.

8.ఆర్థిక స్థోమత లేని పూర్వ విద్యార్థుల కుటుంబం సభ్యుల పిల్లలకు…చదువు కోసం… ఆర్థిక… సహాయం. చేయనున్నారు.

========================

========================

వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1993 – 94 సంవత్సరాల్లో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో పనిచేస్తూ ఎక్కడెక్కడో స్థిర పడ్డారు. డిసెంబర్ 12న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. 27 సంవత్సరాల క్రితం చదువుకున్న పూర్వ విద్యార్థులు అందరు వారు చదివిన రోజులను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొనున్నారు. పూర్వ విద్యార్థులతో పాటు చదివి మధ్యలో మానేసిన స్నేహితులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక విశేషం.. కావున ప్రతి ఒక్కరు తొలి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో తప్పకుండా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పూర్వ విద్యార్థులు తెలిపారు.

By admin