గుర్తుకొస్తున్నాయి..27 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక (1993-94)

ఘనంగా నిర్వహించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండే తీపి జ్ఞాపకాలు చిన్నతనంలోనే ఉంటాయి. తను చదువుకునే రోజులు. చేసే అల్లరి స్నేహితుల కోసం చేసే ఫైటింగ్లు వారితో కలిసి ఆడిన ఆటలు చిన్న చిన్న గ్యాంగ్​లు అవన్నీ ఓ మధురమైన క్షణాలు. మళ్లీ అవన్నీ గుర్తు చేసుకుంటూ ఇరవై ఏడేళ్ల తర్వాత కలుసుకుని ఆనందంగా గడిపారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి లోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు (1993-94)….
 
############################

కర్నూలు జిల్లా వెల్దుర్తి లోని  స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహించారు. 1993-94 విద్యా సంవత్సరం నాటి పూర్వపు విద్యార్థులు ఇరవై ఏడేళ్ల తర్వాత వారు చదువుకున్న పాఠశాలలో కలుసుకుని ఆనందంగా గడిపారు. వాట్సప్ వేదికగా గత మూడు నెలల నుంచి మిత్రులందరూ ఒకరినొకరు పరిచయం చేసుకుని ఈ కార్యక్రమం నిర్వహించుకున్నారు. అప్పట్లో వారికి విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులను సాదరంగా ఆహ్వానించారు. చదువు అనంతరం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఒకరోజు ముందుగానే వెల్దుర్తికి చేరుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకుని మధుర జ్ఞాపకాలను తలుచుకుంటూ సంతోషంగా గడిపారు. వారు చదువుకున్న రోజుల్లో కొన్ని మధుర జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ సందడి చేశారు. చదువు చెప్పిన గురువులను ఘనంగా సత్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

By admin