ఎమ్మిగనూరు నియోజకవర్గ ఐ-టీడీపీ అధ్యక్షుడిగా ఎన్. రాఘవేంద్ర నియామకం
కర్నూలు టౌన్ , డిసెంబర్ 13, (సీమకిరణం న్యూస్) :
 ఎమ్మిగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అనుబంధ సోషల్ మీడియా సంస్థ ఐ టీడీపీ అధ్యక్షుడిగా రాఘవేంద్ర నియామకం అయ్యారు. ఈ మేరకు రాఘవేంద్రను అధ్యక్షుడిగా నియమిస్తూ కర్నూలు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు నియామక పత్రాన్ని అందజేశారు. ఎమ్మిగనూరు ఐ టీడీపీ అధ్యక్షుడిగా నియమించినందుకు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర రెడ్డి గారికి రాఘవేంద్ర ధన్యవాదాలు తెలియజేశారు.

By admin