పే అండ్ ప్లేపై అపోహ వీడండి.
– పేద క్రీడాకారుల నుంచి రుసుము వసూలు చేయడం లేదు
– క్రీడాశాఖ సీఈవో నాగరాజునాయుడు
కర్నూలు స్పోర్ట్స్, డిసెంబర్ 14, ( సీమకిరణం న్యూస్) :
 క్రీడాకారుల నుంచి డబ్బులు వసూలు చేస్తామన్న అపోహలను, పేద క్రీడాకారులు విడనాడలని, పేద క్రీడాకారులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండానే క్రీడాసాధన చేసుకోవచ్చునని జిల్లా క్రీడాశాఖ సీఈవో నాగరాజు నాయుడు విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక డీఎస్ఏ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆటవిడుపు కోసం, ఫిట్నెస్ కోసం, కొన్ని సంస్థల నుంచి వచ్చే అన ధికార పోటీలకు మాత్రమే నామమాత్రపు రుసుములను వసూలు చేస్తామని తెలిపారు. బీపీఎల్కు దిగువ ఉన్న పేద క్రీడాకారులను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర క్రీడాశాఖతో పాటు జిల్లా క్రీడాశాఖ ఎల్లప్పుడు కృషిచేస్తుందన్నారు. వారికోసం నిత్యం శిక్షకులను సైతం అందుబాటులో ఉంచావున్నారు. సమావేశంలో ఛీప్ కోచ్ భూపతిరావ్, డీఎస్ఏ సిబ్బంది పాల్గొన్నారు.

By admin