యూటీఎఫ్ సీనియర్ నాయకులు అబ్దుల్  లతీఫ్
మహాధర్నాకు తరలిరండి
యూటీఎఫ్ సీనియర్ నాయకులు అబ్దుల్  లతీఫ్
ప్యాపిలి, డిసెంబర్ 15, ( సీమకిరణం న్యూస్ ):
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు తన సలహాదారు ద్వారా సాంకేతిక సమస్య ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందని రెండున్నర సంవత్సరాలుగా రద్దు చేస్తామని ఈరోజు మాట మార్చారని యూటీఎఫ్ సీనియర్ నాయకులు అబ్దుల్ లతీఫ్ అన్నారు. పాదయాత్రలో కేవలం ఓట్ల కోసం అధికారం కోసమే ఆనాడు హామీ ఇచ్చారా అని ప్రశ్నించారు.కోవిడ్ కారణంగా ఇన్నాళ్లూ మీ మాయ మాటలు మోస పూరిత మాటలు  భరిస్తూ వచ్చామని, ఎప్పుడూ లేని విధంగా చీఫ్ సెక్రటరీ ద్వారా కేవలం 14.29 పర్సెంట్ ఫిట్మెంట్ ప్రకటించడం దారుణమన్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఉద్యోగ ఉపాధ్యాయ నాయకులను చర్చలకు పిలిచి 2018 జూలై నుండి 55% ఫిట్మెంట్ తప్పక ప్రకటించాలని, లేకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని జేఏసీ పిలుపు మేరకు రేపు డోన్ తహసీల్దార్ కార్యాలయం ముందు జరిగే ధర్నా లో అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని యూటీఎఫ్ ప్యాపిలి మండల సీనియర్ నాయకులు అబ్దుల్ లతీఫ్ పిలుపునిచ్చారు.

By admin