జేఏసీ  ధర్నాకు తరలిరండి
జేఏసీ  ధర్నాకు తరలిరండి
ఎస్టీయు జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్ నాయక్
ప్యాపిలి, డిసెంబర్ 15, (సీమకిరణం న్యూస్):
రాష్ట్ర వ్యాప్తంగా జే ఏ సి ల ఆధ్వర్యంలో
 పి ఆర్ సి అమలు,పెండింగులో ఉన్న డి ఏ లు మంజూరు,సి పి యస్ విధానం రద్దు వంటి 71 సమస్యల పరిస్కారానికై ఐక్య వేదిక(ఏ పి జే ఏ సి & ఏ పి జే ఏ సి అమరావతి) ఇచ్చిన పిలుపు మేరకు 16-12-2021 న అన్ని తాలూకా కార్యాలయం/ ఆర్టీసి డిపో/కలెక్టరేట్ ల వద్ద ఉద్యోగుల ధర్నాలు జరుగుతున్నాయని మొక్కవోని దీక్షతో, ముందు జరిగిన కార్యక్రమాల కంటే  అత్యధికంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని యస్ టి యు జిల్లా కార్యదర్శి వెంకట్ నాయక్ పిలుపునిచ్చారు.స్థానిక ప్యాపిలి యస్ టి యు ప్రాంతీయ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో  యస్ టి యు నాయకులు ధర్నా కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యస్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్ నాయక్ ,యస్ టి యు ప్యాపిలి ప్రధాన కార్యదర్శి చిన్నపరెడ్డి, సహధ్యక్షులు వెంకటేష్,సుదర్సన్ రెడ్డి,ఉపాధ్యక్షులు ఇక్బాల్ హుసేన్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

By admin