అమరావతి : మన దేశంలో కోవిడ్‌ మహమ్మారిపైనా క్రికెట్‌ ఆధిపత్యం సాధించింది. కోవిడ్‌ వైరస్‌ నిలువెల్లా వణికించిన తరుణంలోనూ గూగుల్‌లో అత్యధిక శాతం మంది క్రికెట్‌పైనే ఆసక్తి చూపించారు. 2020లో గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్‌ చేసిన అంశంగా ఐపీఎల్‌ నిలిచింది. దాని తర్వాతే కరోనా వైరస్‌ గురించి జనం వెతికారు. ఈ రెండింటి తర్వాత అమెరికా ఎన్నికలు, పీఎం కిసాన్‌ యోజన, బిహార్‌ ఎన్నికల అంశాలు వరుసగా మూడు, నాలుగు, ఐదవ స్థానాల్లో ఉన్నాయి. 2020లో ఎక్కువ మంది వెతికిన అంశాల జాబితాను గూగుల్‌ ఇటీవల విడుదల చేసింది. త్రిపుర రాష్ట్రంలో అత్యధికంగా ఐపీఎల్‌ క్రికెట్‌ గురించి సెర్చ్‌ చేయగా, మన రాష్ట్రంలో 41 శాతం మంది మాత్రమే దీని ఆరా తీశారు. తెలంగాణలో మన కంటె ఒక్క శాతం ఎక్కువ మంది సెర్చ్‌ చేశారు. ఏపీలో ఈ అంశంపై విశాఖపట్నం, భీమవరం, చిత్తూరు నుంచి అత్యధికంగా.. నంద్యాల, అనంతపురంలో అతి తక్కువగా శోధించారు. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *