టోక్యో: మనమంటే ఐపీఎల్‌ వినోదంలో మునిగాం…. ఇప్పుడేమో ఆస్ట్రేలియా సిరీస్‌పై కన్నేశాం. కానీ ప్రపంచవ్యాప్తంగా 2021 టోక్యో ఒలింపిక్స్‌పైనే చర్చ జరుగుతోంది. జపాన్‌ ప్రభుత్వం కచ్చితంగా నిర్వహించి తీరుతామని ప్రకటించినప్పటికీ ఏ మూలనో సందిగ్ధం మాత్రం వీడటం లేదు. పైగా నెలల వ్యవధిలోనే విశ్వ క్రీడల నిర్వహణపై జపాన్‌ వాసుల వ్యతిరేకత రోజురోజుకీ పెరుగుతోంది. గతంలో 48 శాతం ఒలింపిక్స్‌ వద్దంటే ఇప్పుడేమో 63 శాతం మంది వద్దే వద్దంటున్నారు. కేవలం 27 శాతమే సుముఖంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తలెత్తే ప్రశ్నలపై సమాధానాలివి

By admin