థానే: భారత మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కరోనావైరస్ కారణంగా మరొ స్నేహితుడిని కోల్పోయారు. క్రికెట్ ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్, వినోద్ కంబ్లితో కలిసి క్రికెట్ ఆడిన విజయ్ షిర్కే కరోనా వైరస్ కారణంగా ఆదివారం(డిసెంబర్ 20) రాత్రి థానే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మాజీ ఫాస్ట్ బౌలర్ విజయ్ షిర్కే వయసు 57 సంవత్సరాలు. విజయ్ షిర్కే 80వ దశకంలో సన్‌గ్రేస్ మాఫత్‌లాల్ తరఫున టెండూల్కర్, వినోద్ కాంబ్లితో కలిసి క్రికెట్ ఆడాడు. ఇప్పటికే కోవిడ్ కారణంగా అక్టోబర్‌లో సచిన్ టెండూల్కర్ తన సన్నిహితుడు అవీ కదమ్ ని కోల్పోయాడు

By admin