బొగ్గు నిల్వల గుర్తింపు, ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి లెక్కిస్తే 131 ఏళ్ల చరిత్ర సింగరేణి సొంతం. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థగా గుర్తింపు పొందింది. మూడు తరాల కార్మికుల చెమట చుక్కలకు ప్రత్యక్ష నిదర్శనం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.వందల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టింది. జియోలాజికల్‌ సర్వే ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఆరు జిల్లాలో గోదావరితీరంలో 22,207 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించింది. ఇప్పటివరకు 1,500 మిలియన్‌ టన్నులకు పైగా బొగ్గును వెలికితీశారు. మరోవైపు కాలక్రమేణా భూ గర్భగనుల తగ్గుదలు, ఓసీపీలు పెరగడం, యాంత్రీకరణతో కార్మికుల సంఖ్య తగ్గుతోంది. కొత్త కార్మిక చట్టాలు, బొగ్గు గనుల ప్రైవేటీకరణ, కాలుష్య నియంత్రణలో భాగంగా థర్మల్‌ విద్యుత్‌ నియంత్రించడం తదితర కారణాలు సింగరేణి భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి

By admin