సీమకిరణం న్యూస్

అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు

  • ఉలిందకొండ ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి

కల్లూరు, ఆగస్టు 10, (సీమకిరణం న్యూస్) :  గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపడం జరుగుతుందని ఉలిందకొండ ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఉలిందకొండ  పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్ పి సుధీర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతిరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఆకస్మికంగా పోలీసులు దాడులు నిర్వహించి మట్కా గుట్కా అక్రమ మైనింగ్ ఇసుక లిక్కర్ సారా పేకాట గ్యాంబ్లింగ్ వాటికి పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇకపై ప్రతి రోజు పోలీసు తనిఖీలు చేపట్టి ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతుంటే అదుపులోకి తీసుకొని 24 గంటల్లో రిమాండ్ కు పంపడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రజలు గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని వారి పేర్లను గోప్యంగా ఉంచి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రజలను కోరారు. గత రెండు రోజులుగా చేపడుతున్న పోలీసు దాడుల్లో 16 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. ఆయా గ్రామాలకు చెందిన ముద్దాయిల వివరాలు ఇలా ఉన్నాయి. ఉలిందకొండ గ్రామానికి చెందిన నాగరాజు, సురేష్ ,వెంకటేశ్వర్లు, నాగప్ప ,నాయకలు గ్రామానికి చెందిన మంగలి జయ రామాంజనేయులు బోయ హరి కుమార్ బోయ రాజు ,నాగభూషణం, చిన్నటేకూరు గ్రామానికి చెందిన వడ్డే ఆనంద్ ,నరసాపురం వడ్డే కృష్ణ, పుసులూరు గ్రామానికి చెందిన బోయ శ్రీను ,లక్ష్మీపురం గ్రామానికి చెందిన శిరీష ఆలియాస్ యేసు ,బాబు ,హడల్ ,దొడ్డిపాడు గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ బాషా, షేక్ సుకూర్, సుధాకర్ రెడ్డి పై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసు నమోదు చేస్తామని పదే పదే రెండు మూడు సార్లు పట్టుబడితే రౌడీ షీటర్ కేసు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *