శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దంపతులు

కర్నూలు / శ్రీశైలం , ఆగస్టు 12, (సీమకిరణం న్యూస్) :

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దంపతులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి గురువారం మధ్యాహ్నం దర్శించుకున్నారు.

పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా…అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సున్నిపెంట చేరుకున్నారు. సున్నిపెంట హెలిప్యాడ్ కు చేరుకున్న కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, ఇంటెలిజెన్స్ ఐజీ శశిధర్ రెడ్డి, డిఐజి వెంకట్రామిరెడ్డి, జిల్లా ఎస్పి సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డిలు ఘన స్వాగతం పలికరు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన ద్వారా శ్రీశైలం చేరుకున్నరు.

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం ఆలయం వద్దకు కుటుంబ సమేతంగా విచ్చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దంపతులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దంపతులు, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ గారు, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు గారు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి కేఎస్‌.రామారావు గారు, అర్చకస్వాములు, వేద పండితులు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికి కేంద్ర హోం శాఖ మంత్రి దంపతులను ఆలయంలోకి తీసుకువెళ్లి స్వామి అమ్మవార్లను దర్శనం చేయించారు.

అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆశీర్వచన మండపంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దంపతులకు అర్చక స్వాములు, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందించారు.

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ గారు, దేవస్థాన ఈవో కేఎస్‌.రామారావు స్వామివారి శేషవస్త్రాలను, ప్రసాదాలను, స్వామి అమ్మవార్ల జ్ఞాపికను అందించి కేంద్ర హోం శాఖ మంత్రి దంపతులకు అందజేశారు.

తరువాత శ్రీశైలంలోని పంచమఠాలలో ఒకటైన ఘంట మఠం జీర్ణోద్ధరణ సందర్భంగా లభించిన పురాతన తామ్ర శాసనాలను ఆలయ ప్రాంగణంలో నిశితంగా పరిశీలించారు. శ్రీశైల దేవస్థానం ఆలయ అధికారులు శాసనలకు సంబంధించిన చారిత్రాత్మక విశేషాలను దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణిమోహన్, దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గారికి వివరించారు.

*అర్జున మొక్కలును నాటి నీళ్ళు పోసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దంపతులు :-*

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శన అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దంపతులు పశ్చిమ మాడ వీధిలో అర్జున మొక్కలును నాటి నీళ్ళు పోశారు.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెంట ఇంటెలిజెన్స్ ఐజీ శశిధర్ రెడ్డి, డిఐజి వెంకట్రామిరెడ్డి, జిల్లా ఎస్ పి సుధీర్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ గారు, దేవస్థాన ఈవో కేఎస్‌.రామారావు, కర్నూల్ ఆర్ డిఓ హరి ప్రసాద్, ఆత్మకూరు డిఎస్పీ శృతి తదితరులున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *