సీనియర్ జర్నలిస్టు అమీర్ ని  పరామర్శించిన వెల్దుర్తి ఎస్సై
సీనియర్ జర్నలిస్టు అమీర్ ని  పరామర్శించిన వెల్దుర్తి ఎస్సై
వెల్దుర్తి ఎస్సై…స్పందించిన తీరుపై హర్షం వ్యక్తం చేసిన  సాటి విలేకరులు
వెల్దుర్తి, ఆగస్టు 16, ( సీమ కిరణం న్యూస్) :  వార్త దినపత్రికలో పనిచేసే ఒక సీనియర్ జర్నలిస్టు అనారోగ్యంతో ఉన్నాడని తెలుసుకున్న వెల్దుర్తి ఎస్సై జి. పెద్దయ్య నాయుడు వెంటనే అతన్ని పరామర్శించడానికి  ఇంటికి వెళ్లారు.  అతని తో మాట్లాడిన అనంతరం…ఆరోగ్యంగా ఉండే వరకూ నా వంతు సహకారం ఉంటుందని సీనియర్ జర్నలిస్టు వార్త  అమీర్ కి భరోసా ఇచ్చారు వెల్దుర్తి ఎస్సై…
ఈ సంఘటన వెల్దుర్తి పట్టణంలో జరిగింది. గత పది సంవత్సరాలుగా వార్త తెలుగు దిన పత్రికలో  సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్న అమిర్ భాష అనారోగ్యంతో బాధపడుతూ వైద్యుల సూచనల మేరకు ఆపరేషన్ చేయించుకున్నాడు. ఈ విషయాన్ని వెల్దుర్తి చెందిన సాటి విలేకరులు ఎస్సై దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన ఎస్సై సోమవారం ఆ విలేఖరి ఇంటికి వెళ్లి అతని క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. దీంతో  ఎస్సై జి . పెద్దయ్య నాయుడు స్పందించిన తీరు పై సాటి విలేకరులు హర్షం వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న తమ విలేకరిపై ఎస్సై చూపిన చొరవను  పాత్రికేయులు అభినందించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *