"స్పందన" ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం రద్దు

కర్నూలు జిల్లా ప్రజలకు కృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు

జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు

కృష్ణాష్టమి సందర్భంగా…ఈ నెల 30న “స్పందన” కార్యక్రమం తాత్కాలిక రద్దు :సోమవారం సోమవారం

 

కర్నూలు కలెక్టరేట్, ఆగస్టు 29, (సీమ కిరణం న్యూస్) :

 

కృష్ణాష్టమి పండుగ ప్రభుత్వ శెలవు దినం కావడంతో…ఈ నెల 30న (సోమవారం) “స్పందన” అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి.. కృష్ణాష్టమి పర్వదినం రోజు అయిన సోమవారం (ఆగస్టు 30వ తేదీ) స్పందన ఫిర్యాదులను సమర్పించేందుకు.. జిల్లా కలెక్టరేట్ కు రావాల్సిన అవసరం లేదన్నారు. తిరిగి వచ్చే వారం నుంచి ఎప్పటిలాగే.. ప్రతి సోమవారం “స్పందన” ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం జరుగుతుందన్నారు.

ఈ సందర్భంగా.. జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు జిల్లా ప్రజలకు కృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలను తెలియజేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *