కర్నూలు జిల్లా… ప్రజలకు కృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు

జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి

  • సోమవారం(ఆగష్టు 30) కృష్ణాష్టమి పండుగ ” సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో “స్పందన కార్యక్రమం” తాత్కాలిక రద్దు

కర్నూలు క్రైమ్, ఆగస్టు 29, (సీమ కిరణం న్యూస్) :

కర్నూలు, సోమవారం(ఆగష్టు 30) కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకుని సోమవారం జరగబోయే ” స్పందన కార్యక్రమము” ఉండదని జిల్లా పోలీసు కార్యాలయం నుండి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

కృష్ణాష్టమి పర్వదినం నేపథ్యంలో ప్రభుత్వ సెలవు దినం కావడంతో జిల్లా వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుండి వ్యయ , ప్రయాసలతో జిల్లా పోలీసు కార్యాలయ స్పందన కార్యక్రమమునకు వచ్చే ప్రజలు , ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించగలరు.

వచ్చే సోమవారం( సెప్టెంబర్ 6) నుండి “స్పందన కార్యక్రమం” యధావిధిగా కోనసాగుతుంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి కర్నూలు జిల్లా ప్రజలకు కృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *