జీవో 217 ను రద్దు చేయాలి
-: కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంట్ జిల్లా డిసిసి అధ్యక్షులు లక్ష్మీ నరసింహ
కర్నూలు టౌన్, సెప్టెంబర్ 09, (సీమ కిరణం న్యూస్):
ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 217 మత్సకారుల జీవితాలకు ఉరితాడులాగా మారుతోందని
కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్ల మెంట్ జిల్లా డిసిసి అధ్యక్షులు లక్ష్మీ నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు.
నంద్యాలలో గురువారం
జరిగిన సమావేశం నిర్వ హించారు.ఈసందర్భంగా లక్ష్మి నరసింహ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 217 మత్సకారుల జీవితాలకు ఉరితాడులాగా మారింద న్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూడా అమలు చేయ లేక పోతున్నారాని తెలిపారు. మత్సకారులకు ఎన్నికల ముందు పాదయాత్రలో చెప్పింది ఏంటి ? ఇప్పుడు చేస్తున్నది ఏంటని సూటిగా ప్రశ్నించారు. చెరువులు, కాలువలు,రిజర్వాయర్ల పై ఆధారపడి మత్స్యకారులు జీవిస్తున్నారని గుర్తు చేశారు. మత్స్యకార భరోసా పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి  మత్స్య కారులను అంతిమంగా వారి పుట్టి కొట్టే నిర్ణయాలు తీసు కుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 217 జీవో తో మత్స్య కారులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని, తక్షణమే  జీవో రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమా లు చేస్తామని హెచ్చరించారు. కాలువలు, రిజర్వాయర్, రిజ ర్వాయర్లు, చెరువులలో చేపలు పెంచుకునే హక్కు కేవలం మత్స్యకారులకు మాత్రమే చెందాలని సూచించారు. కార్య క్రమంలో పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు పఠాన్ హాబీబ్ ఖాన్, ఇస్మాయిల్, జిల్లా కార్యదర్శి జనార్దన్ యాదవ్, రహమాన్, తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *