పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత
-: వినాయ‌క విగ్ర‌హాలు పంపిణీ కార్య్రమంలో టి.జి భ‌ర‌త్‌
కర్నూలు టౌన్, సెప్టెంబర్ 09, (సీమకిరణం న్యూస్) :
ప‌ర్యావ‌ర‌ణ పరిరక్షణ మనం దరి బాధ్యతని, అంద‌రూ మ‌ట్టి వినాయ‌కుడి విగ్ర‌హాల‌నే పెట్టాల‌ని టిజివి సంస్థ‌ల చైర్మ‌న్ టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని పాత‌బ‌స్టాండులో వాస‌వీ ఏజెన్సీస్‌, గోదావ‌రి పాలిమ‌ర్స్ ఆద్వ‌ర్యంలో ఏర్పాటుచేసిన మ‌ట్టి వినాయ‌కుడి విగ్ర‌హాల పంపిణీ కార్యక్రమం గురువారం ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి  ముఖ్య అతిథిగా టిజి భ‌ర‌త్ హాజ‌ర‌య్యారు.ఈ సంద‌ర్భంగా టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ గ‌త ఆరేళ్లుగా మ‌ట్టి వినాయ‌కుడి  విగ్ర‌హాలు ప్ర‌జ‌ల‌కు ఉచితంగా అంద‌జేస్తున్న వాస‌వీ ఏజెన్సీస్‌, గోదావ‌రి పాలిమర్స్ నిర్వాహ‌కుల‌ను అభినందించారు. క‌ర్నూల్లోని ప్ర‌తి వార్డుకు ప్ర‌తి ఏటా వినాయ‌కుడి విగ్ర‌హాలు ఏర్పాటు చేసేందుకు త‌మ టిజివి సంస్థ ముందుండేద‌ న్నారు.అయితే క‌రోనా కార‌ణాల దృష్ట్యా ఇప్పుడు అందించ‌లేక‌పోయిన‌ట్లు భ‌ర‌త్ వివ‌ర‌ణ ఇచ్చారు. రానున్న రోజుల్లో క‌ర్నూల్లో కేవ‌లం మ‌ట్టి గ‌ణేష్ విగ్ర‌హాలు మాత్ర‌మే ఉండేలా కృషి చేస్తామ‌న్నారు.
600 మ‌ట్టి వినాయ‌క విగ్ర‌ హాల‌ను ప్ర‌జ‌ల‌కు అంద‌జేశారు.
కార్య‌క్ర‌మంలో వాసవి ఏజెన్సీస్ అధినేత శేషఫణి, గోదావరి పాలిమర్స్ సంస్థ ప్రతినిధి వెంకటేష్, అవోపా కన్వీనర్ నాగేశ్వరరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ టీవీ రత్న ప్రసాద్, అంజిరెడ్డి, సుబ్బా రావు, శ్రీనివాసరెడ్డి తదితరులు  పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *