విఘ్నాలు తొలగాలి….శుభాలు కలగాలి
జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా మంత్రులు, జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు
కర్నూలు కలెక్టరేట్, సెప్టెంబర్ 09, (సీమకిరణం న్యూస్) :
విఘ్నాలు తొలగించి శుభాలు, విజయాలను అందించే వినాయక చవితి పండగను భక్తి శ్రద్ధలతో కరోనా నిబంధనలను పాటించి జరుపుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావులు సంయుక్తంగా గురువారం ప్రకటనలో జిల్లా ప్రజలను కోరారు.
వినాయకుని ఆశీస్సులతో కరోనా వైరస్ త్వరితగతిన పూర్తిగా నశించి ప్రజలందరూ ఆరోగ్యాలుతో జీవించాలని, కరోనాపై విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. మట్టి గణపతి విగ్రహాలునే వినియోగించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో విరజిల్లాలని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా జిల్లా ప్రజలుకు జిల్లా మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ  పథకాలుకు ఎలాంటి అవరోధాలు లేకుండా ముందుకు సాగాలని, ప్రభుత్వానికి సంపూర్ణ విజయాలు అందాలని వారు ఆకాంక్షించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *