మట్టి వినాయకులను పూజిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
గీతాంజలి నర్సింగ్ కళాశాల అధినేత పెరుగు విజయవర్ధన్ రెడ్డి
కర్నూలు టౌన్, సెప్టెంబర్ 08, ( సీమకిరణం న్యూస్) :
మట్టి వినాయకులను పూజిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దామని గీతాంజలి నర్సింగ్ కళాశాల అధినేత పెరుగు విజయవర్ధన్ రెడ్డి అన్నారు. స్థానిక కర్నూలు నగరంలోని గాయత్రీ ఎస్టేట్ సర్కిల్ గీతాంజలి నర్సింగ్ కళాశాల నుండి రాజీవ్ విహార్ సర్కిల్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని గీతాంజలి నర్సింగ్ కళాశాల అధినేత పెరుగు విజయవర్ధన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాతీయ వాద విద్యార్థి నాయకులు రాయలసీమ విద్యార్థి సంఘాల జెఎసి చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ & విద్యార్థి జెఎసి కన్వీనర్ ఎం మోహన్ , గీతాంజలి నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కె.వసంతకుమారి , ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు బి భాస్కర్ నాయుడు, రాయలసీమ యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు రవి కుమార్ మరియు నర్సింగ్  కళాశాల అధ్యాపకలు విద్యార్థిని విద్యార్థులు పాల్గోన్నారు…

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *