మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
– ఆరు సంవత్సరాలుగా వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల  పంపిణీ.
కర్నూలు టౌన్, సెప్టెంబర్ 08, (సీమకిరణం న్యూస్) :
మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటూ గత ఆరు సంవత్సరాలుగా వాసవి సేవాదళ్ సభ్యుల ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుల విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు.అందులో భాగంగా బుధవారం కృష్ణా నగర్ లోని అమ్మ బజ్జి సెంటర్ వద్ద,సీతా రామ్ నగర్ లోని సాయి కృప బ్యాంగిల్ సెంటర్ వద్ద,కేసీ కెనాల్ వినాయక  ఘాట్,
వన్ టౌన్ రామాలయం  పరిసర ప్రాంతాల్లో సుమారు ఆరు వందల మట్టి వినాయకులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వాసవి సేవాదళ్ నాయకులు కమలాపురం సునీల్,సోమిశెట్టి నవీన్ కుమార్,గుండా శ్రీధర్,ప్రవీణ్ శంకర్ లు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్విరామంగా మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నాము అన్నారు.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడడం వల్ల వచ్చే నష్టాలను ప్రజలకు వివరించి మట్టి వినాయకులను ప్రోత్సహించే విధంగా నిర్విరామంగా కృషి చేస్తున్నామన్నారు.ప్రతి ఒక్కరు తమ ఇంట్లో ఈకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాల తోనే పూజలు నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వాసవి సేవాదళ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *