జిల్లా విద్యాశాఖాధికారిగా నాగేశ్వరరావు
జిల్లా విద్యాశాఖాధికారిగా నాగేశ్వరరావు
: జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుండి జిల్లా విద్యాధికారిగా పదోన్నతి
జిల్లా విద్యాశాఖాధికారిగా నాగేశ్వరరావు
కర్నూలు కలెక్టరేట్, సెప్టెంబర్ 13, (సీమకిరణం న్యూస్) :
జిల్లా విద్యాశాఖాధికారిగా విధులు నిర్వహిస్తున్నటువంటి సాయిరాం పదోన్నతి పై రాష్ట్ర బాలభవన్ ప్రత్యేకాధికారి, డైరెక్టర్ గా విజయవాడకు సోమవారం బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లా ఉప విద్యా శాఖాధికారిగా విధులు నిర్వహిస్తున్నటువంటి
నాగేశ్వరరావును (ఎఫ్.ఏ.సి.) కింద జిల్లా విద్యాధికారిగా బదిలీ అయ్యారు. ఈయన త్వరలోనే పదవి బాధ్యతలు చేపట్టనున్నారు.
అయితే జిల్లా విద్యాశాఖాధి కారి పదవికి పలువురు అధి కారులు వారి వారి స్థాయిలో ముమ్మరంగా పైరవీలు చేసినప్పటికీ వారికి నిరాశే మిగిలిందని చెప్పవచ్చు.
——–
నాగేశ్వరరావు ప్రస్థానం
—–
నాగేశ్వరరావు (జిల్లా విద్యా శాఖ అధికారి)
స్వస్థలం : ఎన్జీవో కాలనీ,కడప.
విద్యాభ్యాసం : ఒకటి నుంచి డిగ్రీ వరకు కడపలోనే.
1983లో జూనియర్ అసిస్టెంట్ గా నియామకం.
1992లో సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి.
2007 సూపరింటెండెంట్ గా పదోన్నతి పొందారు.
2017 లో.అసిస్టెంట్ డైరెక్టర్ గా  నియామకం.
1 ఏప్రిల్ 2021నుంచి కడప
ఉప  విద్యాశాఖాధికారిగా కొనసాగారు.
ప్రస్తుతం కర్నూలు జిల్లా
విద్యాశాఖాధికారిగా
(ఎఫ్ ఎస్ సీ ) నియామకం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *