కేసిఆర్ సిఎం పదవికి రాజీనామా చేయాలి
కేసిఆర్ సిఎం పదవికి రాజీనామా చేయాలి

-: కలిసికట్టుగా బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుదాం
-: మీడియా సమావేశంలో లంబాడి హక్కుల పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్.కైలాష్ నాయక్

కర్నూలు టౌన్ , సెప్టెంబర్ 13,  (సీమకిరణం న్యూస్) :

దిశా ఘటన మరువకముందే.. అభం శుభం తెలియని ఆరేళ్ళ గిరిజన లంబాడి సభావత్ చైత్ర బాయి లాంటి హత్యలు నియంత్రించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని, నైతిక బాధ్యత వహిస్తూ కె చంద్రశేఖర రావు తన ముఖ్యమంత్రి పదవి కి రాజీనామా చేయాలని  లంబాడి హక్కుల పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్.కైలాష్ నాయక్  డిమాండ్ చేశారు. సోమవారం లంబాడి హక్కుల పోరాటసమితి కార్యలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ముక్కు పచ్చలారని చిన్నారులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు మరీ పైశాచిక దాడులు నియంత్రించడంలో
ముఖ్యమంత్రులు విఫలమయ్యారని దుయ్య బట్టారు.
మహిళల రక్షణ కోసం కఠిన మైన మహిళల పేరుతో భరోసా చట్టాలు అమలు చేస్తున్నప్ప టికీ ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. తప్పు చేసిన నిందితులకు స్థానికంగా అధికార పార్టీ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతోనే తప్పులు చేసిన నేరస్తులు సమాజంలో యదేచ్ఛగా తిరుగుతున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక మాధ్యమాల పై సరైన నియంత్రణ అమలు చేయకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి సమయాల్లో ప్రాంతా లకు అతీతంగా పార్టీలు, ప్రజా సంఘాలు కలిసికట్టుగా బాధి తుల వైపు ఉండి న్యాయం జరిగే వరకు అలుపెరుగని పోరాటాలు చేసేందుకు సన్నద్ధం కావాలని  ఆర్.కైలాష్ నాయక్   పిలుపు నిచ్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *