ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కు అన్ని రాజకీయ పార్టీ నాయకులు సహకరించాలి.... ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలి... జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు...

ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కు అన్ని రాజకీయ పార్టీ నాయకులు సహకరించాలి….

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలి…

జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు…

కర్నూలు కలెక్టరేట్ , సెప్టెంబర్ 17, (సీమకిరణం న్యూస్) : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీ నాయకులు సహకరించాలని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు  పేర్కొన్నారు.
సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఎం పి టి సి, జెడ్ పి టి సి ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్  మనజీర్  జిలాని సామూన్, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామసుందర్ రెడ్డి, జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ ఆదివారం ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుందని కౌంటింగ్ కు సంబంధించి 1785 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి గతంలో పేర్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఎవరైనా ఎన్నికల ఏజెంట్ల ను మార్చుకోవాలి అనుకుంటే ఈరోజు లోపల వారి పేర్ల వివరాలను వెంటనే ఇవ్వాలన్నారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని వివిధ పార్టీలకు సంబంధించిన ఎన్నికల  ఏజెంట్లు తప్పకుండా రేపు సాయంత్రం 5 గంటల లోపల covid test చేయించుకోవాలన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తయినవారు  రెండు డోసులు పూర్తయినట్లు సర్టిఫికెట్ చూపించి కౌంటింగ్ ఏజెంటుగా వెళ్ళవచ్చు అన్నారు. ఎం పి టి సి, జెడ్ పి టి సి ఎన్నికల సందర్భంగా ఆదివారం ఉదయం నుంచి 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుందని కౌంటింగ్ హాలుకు కిలోమీటర్ దూరంలో ఎవరికీ ప్రవేశం లేదన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *