రాయలసీమ యూనివర్సిటీ భవనాల్లో కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టరు మరియు జిల్లా ఎన్నికల అథారిటీ పి.కోటేశ్వరరావు, ఎస్పి సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, జెసిలు 

రాయలసీమ యూనివర్సిటీ భవనాల్లో కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టరు మరియు జిల్లా ఎన్నికల అథారిటీ పి.కోటేశ్వరరావు, ఎస్పి సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, జెసిలు

కర్నూలు కలెక్టరేట్ , సెప్టెంబర్ 17, (సీమకిరణం న్యూస్) :
ఆదివారం జరగనున్న జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాలలో పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత ఎన్నికల నిర్వహణ అధికారులకు జిల్లా కలెక్టరు మరియు జిల్లా ఎన్నికల అథారిటీ పి.కోటేశ్వరరావు ఆదేశించారు.

శుక్రవారం రాత్రి రాయలసీమ యూనివర్సిటీ భవనాల్లో కౌంటింగ్ సెంటర్స్ హాల్ లో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జెసిలతో కలిసి పరిశీలించారు.

కౌంటింగ్ కేంద్రంలో ఎక్కడా పొరపాటు జరగకుండా చెక్ లిస్ట్ ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేయాలని కర్నూలు ఆర్ డి ఓ, డిఆర్డిఎ పిడిలకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్‌, బ్యారికేడ్లు, తాగునీటి వసతి, భోజన వసతి ఏర్పాటు చేయాలన్నారు.  గదులలో విద్యుత్‌ సౌకర్యంతో పాటు టేబుళ్లు, కుర్చీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా తాగునీటిని ఏర్పాటు చేయాలని అన్నారు. భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయాలని సంబంధిత శాఖ అధికారులకు, పోలీసు అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ గారి వెంట జాయింట్‌ కలెక్టర్‌ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, కర్నూల్ ఆర్ డి ఓ హరిప్రసాద్, డిఆర్ డిఏ పిడి వెంకటేశులు, కర్నూలు రూరల్ తహసీల్దార్ వెంకటేష్ నాయక్, డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *