వినాయక   నిమజ్జన వేడుకలను సామరస్యంగా జరుపుకోవాలి

వినాయక   నిమజ్జన వేడుకలను సామరస్యంగా జరుపుకోవాలి

కులమతాలకతీతంగా భక్తిభావంతో జరుపుకుందాం

నేషనల్ ఉమెన్స్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహబూబ్ బాషా

కర్నూలు టౌన్, సెప్టెంబర్ 17, (సీమకిరణం న్యూస్):

కర్నూలు నగరంలో శనివారం  నిర్వహించే వినాయక నిమజ్జనం వేడుకలను  కులమతాలకు అతీతంగా భక్తి భావం సామరస్యంతో  జరుపుకోవాలని నేషనల్ ఉమెన్స్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి   మహబూబ్ బాషా అన్నారు. కరోనా మహమ్మారి  ఇంకా తగ్గలేదని  అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూ    ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి ఈ  నిమజ్జన కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.  ఊరేగింపు   సమయంలో కూడా యువత   అల్లర్లకు  పాల్పడ కుండా సోదరభావంతో ముందుకు సాగాలని  ఆయన అన్నారు.  ప్రతి సంవత్సరం వేడుకలను  ఏ విధంగా జరుపు  జరుపుకుంటున్నాము అదే విధంగా ఈ సంవత్సరం కూడా  జరుపుకొని  కర్నూలు మతసామరస్యానికి వేదిక అని నిరూపించాలి అని అన్నారు.  నిమజ్జన సమయంలో కూడా ఎంతో జాగ్రత్తలు పాటించాలని అన్నారు.  ప్రజల  గుంపులు గుంపులుగా ఒకే చోట ఉండకుండా సామాజిక దూరం పాటిస్తూ ఈ వేడుకలను  తిలకించాలని అన్నారు.  పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చిన సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ  నిమజ్జన కార్యక్రమాలు  నిర్విఘ్నంగా జరుపుకోవాలని అన్నారు. వినాయక నిమజ్జనోత్సవ వేడుకలను ఎంత సామరస్యంగా చెప్పుకుంటే అంత మేలు చేకూరుతుందని అన్నారు.  నిమజ్జనం జరుగుతున్న  వినాయక ఘాట్ వద్ద కూడా  యువకులు జాగ్రత్తలు పాటించాలని అన్నారు.  వినాయకులను ఊరేగించే సందర్భంలో కూడా  పోట్లాటలకు తావివ్వకుండా   సామరస్యంతో ముందుకు సాగాలని అన్నారు.  వినాయక నిమజ్జనం  కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో   సోదర భావంతో జరుపుకుందామని ఆయన పిలుపునిచ్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *