మైనారిటీ సబ్ ప్లాన్ అమలు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం హర్షణీయం

మైనారిటీ సబ్ ప్లాన్ అమలు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం హర్షణీయం

– నల్లా రెడ్డి ఫౌండేషన్ కేదార్ నాథ్

కర్నూలు టౌన్, సెప్టెంబర్ 17, (సీమకిరణం న్యూస్):

 కేబినెట్ సమావేశంలో  మైనారిటీ సబ్ ప్లాన్  అమలు చేసిన ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం  హర్షణీయమని   నల్లా రెడ్డి ఫౌండేషన్  వ్యవస్థాపకులు కేదార్ నాథ్  అన్నారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  తండ్రికి తగ్గ  తనయుడిగా  అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తున్నారని అన్నారు.  దీంతోపాటు అన్ని కులాలకు దశలవారీగా  న్యాయం చేస్తున్నారన్నారు.  ఇందులో భాగంగానే ఉప ప్రణాళిక ప్రకారం, ప్రభుత్వం  మైనార్టీల సంక్షేమం కోసం  మరియు   వారి అభివృద్ధి కోసం నియమించబడిన సంఘాలకు రాష్ట్ర బడ్జెట్‌లో ప్రత్యేక నిధులను  కేటాయించడం అభినందనీయమన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్,  మైనార్టీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST) మరియు వెనుకబడిన తరగతులు (BC) లతో సమానంగా మైనారిటీలకు ఉప ప్రణాళిక అమలు చేయడానికి ఆమోదం  తెలపడం  మైనార్టీలో  ఆనందం వెల్లివిరుస్తోంది అని  పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీలకు ఉప ప్రణాళిక ప్రకారం, ప్రభుత్వం వారి ప్రత్యేక సంక్షేమం  వారి అభివృద్ధి కోసం నియమించబడిన సంఘాలకు రాష్ట్ర బడ్జెట్‌లో  ప్రత్యేక నిధులను  విడుదల చేసేందుకు  నిర్ణయం తీసుకోవడం  అన్ని విధాల  మైనారిటీ వర్గాలకు  మేలు చేకూరుతుందని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *