పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
వెల్దుర్తి మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తా
త్వరలోనే వెల్దుర్తిలో రోడ్డు వెడల్పు కార్యక్రమానికి శ్రీకారం
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
వెల్దుర్తి పట్టణానికి శాశ్వత తాగునీటి పథకాన్ని పత్తికొండ ఎమ్మెల్యే , కర్నూలు ఎంపీ
వెల్దుర్తి, సెప్టెంబర్ 17, (సీమకిరణం న్యూస్) :
వెల్దుర్తి మండలాన్ని అన్ని రంగాలలో మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని  పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పేర్కొన్నారు. గురువారం పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని కృష్ణగిరి రిజర్వాయర్ నుంచి వెల్దుర్తి పట్టణానికి శాశ్వత తాగునీటి పథకాన్ని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి , కర్నూలు ఎంపీ  డాక్టర్ సింగరి సంజీవ్ కుమార్, వైయస్సార్ పార్టీ కర్నూలు పార్లమెంటరీ అధ్యక్షులు, కర్నూలు నగర మేయర్ బివై రామయ్య , వైయస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి  తదితరులు పథకాన్ని ప్రారంభించారు.
అనంతరం వెల్దుర్తి లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరై గత ప్రభుత్వంలో ఈ నియోజకవర్గం నుండి ఉప ముఖ్యమంత్రి అయిన కనీసం  త్రాగునీరు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని, ఎమ్మెల్యే అయిన రెండేళ్లలోనే  పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పూర్తిచేయడం అభివృద్ధి పట్ల నిదర్శనమని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్  మరియు కర్నూలు పార్లమెంటరీ అధ్యక్షులు, నగర మేయర్ బి వై రామయ్య కొనియాడారు. అనంతరం బహిరంగ సభలో పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి  మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వెల్దుర్తి పట్టణ వాసులు తమకు త్రాగునీరు 15 రోజులు మరియు 20 రోజులకు ఒకసారి వస్తున్నాయని మా కష్టాలు తీర్చమని అడగడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసి వెల్దుర్తి పట్టణానికి త్రాగునీటి సమస్య చాలా ఇబ్బందిగా ఉందని తెలియజేయడంతో స్పందించి మంజూరు చేయడం జరిగిందన్నారు. త్వరలో పత్తికొండ పట్టణంలో కూడా వైండింగ్ పనులు మొదలు పెడతామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ముత్యాల శైలజ వెల్దుర్తి, క్రిష్ణగిరి మండలాల కన్వీనర్లు రవి రెడ్డి, ఆర్ బి వెంకట రాముడు, పత్తికొండ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కటారు కొండ మాధవరావు, క్రిష్ణగిరి మండల ఇన్చార్జ్ డాక్టర్ వెంకట్ రామ్ రెడ్డి,వెల్దుర్తి బ్రహ్మగుండం దేవస్థానం చైర్మన్ పెద్దరెడ్డి, వైఎస్సార్ పార్టీ పట్టణ ప్రెసిడెంట్ వెంకట నాయుడు మరియు ఆర్డబ్ల్యూఎస్ ఈ ఈ మనోహర్ , డీఈ రమేష్ కుమార్ రెడ్డి , ఏఈ లు దివ్య , శ్రీనాథ్ రెడ్డి , ఎమ్మార్వో రాజేశ్వరి ఎంపీడీవో సుబ్బారెడ్డి , ఈ ఓ ఆర్ డి నరసింహులు , గ్రామపంచాయతీ ఆఫీసర్ ఉపేంద్ర , అగ్రికల్చర్  అధికారి రవి ప్రకాష్  మరియు వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *