సన్మాన సభకు టైలర్లందరు వచ్చి జయప్రదం చేయండి

:-  టైలర్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నజీర్ అహ్మద్

 

గోనెగండ్ల,  సెప్టెంబర్ 18, (సీమకిరణం న్యూస్) :

నవ్యాంధ్ర టైలర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు విక్కీ నాగేశ్వరరావు,జిల్లా అధ్యక్షుడు ఖలీల్ భాష పిలుపుమేరకు విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో షేక్ సుభాన్ బి గారిని ప్రమాణ స్వీకారం అనంతరం సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సభకు మన కర్నూలు జిల్లా టైలర్లతోపాటు మండలంలోని టైలర్లు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా టైలర్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి, గోనెగండ్ల టైలర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నజీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. పాత్రికేయుల సమావేశంలో నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రస్తుతం ఫ్యాషన్ రంగం విస్తరించడంతో అందుకు దీటుగా రెడీమేడ్ దుస్తులు రావడంతో టైలర్స్ ఆర్థిక అభివృద్ధికి దూరమవుతూ వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సీఎం జగన్ టైలర్ల కష్టాలను చూసి చేదోడు పథకం ద్వారా పదివేల రూపాయలు ఇవ్వడం ద్వారా కొంతమేరకు ఆర్థికంగా ఉపశమనం లభించింది,కానీ పూర్తిస్థాయిలో టైలర్ల కష్టాలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి టైలర్లు అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రత్యేకంగా వర్తింపజేయాలని,మరెన్నో సంక్షేమ పథకాలు అందాల్సి ఉందని,వాటి సాధన కోసం ప్రతి ఒక్కరు ఐక్యమత్యంగా ఉండి పోరాడాల్సిన సమయం వచ్చిందని తెలిపారు.కాబట్టి జిల్లాలోని,మండలంలోని ప్రతి ఒక్క టైలర్ ఈ సభకు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టైలర్లు నల్లా రెడ్డి, నరసింహులు గౌడ్, కాసిం, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *