"స్పందన" ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం రద్దు

ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ

జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ పి.కోటేశ్వరరావు

కర్నూలు కలెక్టరేట్, సెప్టెంబర్ 19, (సీమకిరణం న్యూస్) :

జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, పకడ్బందీగా, సమర్థవంతంగా అందరి సహకారంతో ప్రశాంతంగా జరుగుతోందని, పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల ఆథారిటీ పి.కోటేశ్వరరావు వెల్లడించారు. ఆదివారం ఉదయం రాయలసీమ విశ్వవిద్యాలయంలో జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించి, ఓట్ల లెక్కింపు ను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ పి.కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మీడియాతో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ…. జిల్లాలో నలభై నాలుగు మండలాల్లో 484 ఎంపీటీసీలు, 36 జడ్పిటిసి స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ చేశామని, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా అందరి సహకారంతో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోందని, మధ్యాహ్నం 1:30 కల్ల ఎంపీటీసీ లెక్కింపు పూర్తవుతుందని, మధ్యాహ్నం నుంచి జెడ్ పి టి సి ఓట్ల లెక్కింపు జరుగుతోందని తెలిపారు. జిల్లా కలెక్టర్ గారి వెంట కర్నూల్ ఆర్ డి ఓ హరి ప్రసాద్, డిఆర్డిఎ పిడి వెంకటేశులు, తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *