మౌన పోరాటానికి మద్దతు తెలిపిన అన్ని పార్టీల నాయకులు
మౌన పోరాటానికి మద్దతు తెలిపిన అన్ని పార్టీల నాయకులు
కౌతాళం, మార్చి 14, (సీమకిరణం న్యూస్) :
కౌతాళం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం పక్కన వున్నటివంటి 0.13 సెంట్లు స్థలాన్ని కొంతమంది కబ్జా చేసి అక్రమంగా షాపులు నిర్వహించడం జరిగింది. ఇందుకు కౌతాళం మండల విలేకరులు రేపు మౌన పోరాటం నిర్వహించుటకు నిర్ణయించుకొని అందుకు మద్దతుగా అన్ని పార్టీల ప్రధాన నాయకులను కలిసి మద్దతు కోరడం జరిగింది. గతంలో ఐ ఏ ఎస్ అధికారులు తాహసిల్దార్ కార్యాలయం నిర్మించుటకు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాంటి స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమిస్తే మీ పోరాటం వెనుక మీ వెంట మేము ఉంటాం అంటూ ప్రతి పార్టీ ప్రధాన నాయకుడు మద్దతు ఇవ్వడం జరిగింది. ప్రతి నాయకుడు మా ధర్నాలో పాల్గొంటామని తెలియజేయడం జరిగింది.
ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైతే ఎవరు సహించమని ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వానికే కేటాయించాలని మేము కూడా మీకు మద్దతు తెలుపుతున్నామని తెలియజేయడం జరిగింది.