ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATETELANGANAWORLD

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం

వెల్దుర్తి టిడిపి మండల అధ్యక్షుడు టి. బలరాం గౌడ్ , తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొమ్మన రమాకాంత రెడ్డి

వెల్దుర్తి పట్టణంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పై విస్తృత ప్రచారం

కేఈ శ్యామ్ బాబు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న వెల్దుర్తి టిడిపి నాయకులు

ఎండను సైతం లెక్క చేయకుండా విస్తృత ప్రచారం చేస్తున్న వెల్దుర్తి టిడిపి నాయకులు

కర్నూలు నజీర్ ప్రతినిధి/ వెల్దుర్తి 04, సీమ కరణం న్యూస్) :

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు సీఎం కావడం ఖాయమని వెల్దుర్తి టిడిపి మండల అధ్యక్షుడు టి. బలరాం గౌడ్ , టిడిపి యువ నాయకులు బొమ్మన రమాకాంత రెడ్డిలు తెలిపారు. శనివారం వెల్దుర్తి పట్టణంలోని 14 వ వార్డులో వెల్దుర్తి టిడిపి మండల అధ్యక్షుడు టి. బలరాం గౌడ్ , టిడిపి యువ నాయకులు బొమ్మన రమాకాంత రెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాల ప్రచారం నిర్వహించారు. టిడిపి బిజెపి జనసేన పార్టీల ఉమ్మడి మిని మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రచార కరపత్రాలు క్యాలెండర్లు ప్రజలకు పంచుతూ సూపర్ సిక్స్ పథకాల అమలు తీరును ఓటర్లకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజలు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, మీ పిల్లల భవిష్యత్‌ కోసం సుపరిపాలన అందించే చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!