కర్నూలులో యమహా ఎస్ఎల్విఆర్ షోరూం ప్రారంభం
కర్నూలు ప్రతినిధి, జూన్ 29, (సీమకిరణం న్యూస్): :
కర్నూలులోని నంద్యాల చెక్ పోస్ట్ కూడలిలో యమహా ఎస్ఎల్విఆర్ షోరూంను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితల చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఎస్ఎల్విఆర్ షోరూం మేనేజింగ్ పార్ట్నర్ చైతన్య రెడ్డి మాట్లాడుతూ యమహా ద్విచక్ర వాహనాలకు ప్రత్యేకస్థానం ఉందని, యువకుల అభిరుచుల అనుగుణంగా మార్కెట్లోకి తీసుకొచ్చిందన్నారు. యమహాలో గృహినులకు కావలసిన ద్విచక్ర వాహనాలు సైతం అందుబాటులో ఉన్నాయన్నారు. యమహా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి పక్కా ప్రణాళికతో ఉందని, అందుకు అనుగుణంగానే వినియోగదారుల సంతృప్తి లక్ష్యంగా సేవలందిస్తామన్నారు. ద్విచక్ర వాహనాలకు అవసరమైన స్పేర్ పార్ట్స్ ను గంటల వ్యవధిలో తీసుకొచ్చి వేగంగా పని పూర్తిచేసి వినియోగదారుల సంతృప్తి స్థాయిని పెంచుతామని వారు ఆశాబావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు గౌరు వెంకటరెడ్డి, ఎస్ఎల్వి ఆర్ మోటార్స్ పార్ట్నర్స్ సోమశేఖర్ రెడ్డి, డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి, కె.వి రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.