జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్

సెకండ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు యుద్ధానికి సిద్ధం కండి : జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్

ఆంధ్రప్రదేశ్

విజృంభిస్తున్న కరోన మహమ్మారి సెకండ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు యుద్ధానికి సిద్ధం కండి :-

టెస్టింగ్.. ట్రేసింగ్… ట్రీట్మెంట్ పకడ్బందీగా చేపట్టండి :-

కలిసికట్టుగా అన్ని టీంలు పని చేసి ధైర్యంగా కరోన సెకండ్ వేవ్ ను కట్టడి చేద్దాం :-

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా పని చేయండి :-

వ్యాక్సినేషన్ వేయించుకొని ఫ్రంట్ లైన్, హెల్త్ కేర్ వర్కర్లకు వంద శాతం వ్యాక్సినేషన్ ఇచ్చేలా చర్యలు చేపట్టండి :-

వ్యాక్సినేషన్ ఒక డోసు కూడా వేస్టేజ్ కాకూడదు :-

మండల అధికారుల వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ :-

కర్నూలు ప్రతినిధి , ఏప్రిల్ 17 ,(సీమ కిరణం న్యూస్ ) : 

ప్రపంచాన్ని గడగడలాడిస్తు విజృంభిస్తున్న కరోన మహమ్మారి సెకండ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు అధికారులు అందరూ కలిసికట్టుగా సమన్వయంతో
పని చేసి ధైర్యంగా కట్టడి చేయాలని మండల స్థాయి అధికారులకు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ ఆదేశాలు జారీ చేశారు.

శనివారం స్థానిక కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి కరోన కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్ లపై కోవిడ్ జిల్లా నోడల్ అధికారులు, ఆర్ డి ఓలు, మున్సిపల్ కమిషనర్ లు, మండల అధికారులు, తహసీల్దార్ లు, ఎంపిడిఓలు, మెడికల్ ఆఫీసర్ లతో జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు అభివృద్ధి) రామ సుందర్ రెడ్డి, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డి.కె.బాలాజీ, డిఆర్ఓ పుల్లయ్య, డిస్ట్రిక్ట్ కోవిడ్ కోఆర్డినేషన్ ఆఫీసర్ డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు, డీఎంహెచ్ఓ డాక్టర్ రామగిడ్డయ్య, జెడ్పి సిఈఓ వెంకటసుబ్బయ్య, డిఐఓ డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి, నోడల్ అధికారులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ సెకండ్ వేవ్ స్టార్ట్ అయిందని, రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయిని, ఈరోజు చూస్తే ఏడువందల పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, కరోన సెకండ్ వేవ్ ను కట్టడి చేసేందుకు అధికారులందరూ సిద్ధం కావాలని ఆదేశించారు. గత మూడు నెలలుగా ఒక డెత్ కూడా జరగలేదు. ఇప్పుడు డైలీ ఒకటి నుంచి రెండు డెత్ లు జరుగుతూ ఉన్నాయి. కరోనా వైరస్ తో కట్టడి చేసేందుకు తమకు అప్పజెప్పిన పనులను వెంటనే స్టార్ట్ చేసి ప్రిపరేషన్ చేయాలన్నారు. దేశంలో కర్నూలు జిల్లాకు ఉన్న అనుభవం ఏ జిల్లాకు లేదని..ఆ అనుభవంతో మొదటి వేవ్ కోవిడ్ ను జిల్లాలో కట్టడి చేయగలిగాం అన్నారు. కలిసికట్టుగా అన్ని టీములు పని చేస్తే ధైర్యంగా కోవిడ్ సెకండ్ వేవ్ ను కట్టడి చేయవచ్చు అన్నారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ పకడ్బందీగా చేపట్టాలన్నారు. ప్రైమరీ కాంటాక్ట్, లక్షణాలు ఉన్న వాళ్లకు, 104 కాల్ చేసి టెస్టులు చేయాలని ఫిర్యాదు చేసిన వాళ్ళందరికీ వెంటనే టెస్టింగ్ చేయాలన్నారు. సివియర్ గా ఉంటే కరోన బాధితులను వెంటనే అంబులెన్స్ లో హాస్పిటల్ తరలించాలన్నారు. మెడికల్ ఆఫీసర్లు చాలా యాక్టివ్ గా ఉండి అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ కరోనా కట్టడి చర్యలు చేపట్టాలన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మెడికల్ కిట్ అందించాలన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న కరోనా బాధితులకు ఆశ, ఏ ఎన్  ఎం, మెడికల్ ఆఫీసర్లు విజిట్ చేస్తూ వారి ఆరోగ్య స్థితి గతులపై పర్యవేక్షించాలి అన్నారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో రిపోర్టింగ్ డేటా ఎంట్రీ చేయాలన్నారు. 104 కాల్ సెంటర్ కు వచ్చిన ఫిర్యాదులను మూడు గంటల్లో టెస్టింగ్, హోమ్ ఐసోలేషన్, బెడ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. వ్యాక్సినేషన్ వేయించుకొని ఫ్రంట్ లైన్, హెల్త్ కేర్ వర్కర్లకు వంద శాతం వ్యాక్సినేషన్ ఇచ్చేలా చర్యలు చేపట్టలన్నారు.
వ్యాక్సినేషన్ ఒక డోసు కూడా వేస్టేజ్ కాకూడదన్నారు. వ్యాక్సినేషన్ పక్రియను ప్లాన్ ప్రకారం ప్రిపేర్ చేసుకొని బేనిఫిషర్ లకు సమాచారం ఇచ్చి జిల్లాకు వచ్చిన వ్యాక్సినేషన్ వందశాతం జరిగేలా చర్యలు చేపట్టనున్నారు. ఎల్లుండి ఉదయం ఏడు గంటలకే వ్యాక్సినేషన్ ప్రక్రియను స్టార్ట్ చేసి వెంటనే డేటా అప్లోడ్ చేసి మధ్యాహ్నం లోపు వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. వాలెంటర్ల్లు, సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో పని చేస్తారు కాబట్టి వాళ్లకు ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించాలన్నారు. కరోన నుండి మనకు మనం రక్షించుకునేందుకు వ్యాక్సిన్ తీసుకోవడం ఏకైక మార్గం అన్నారు.

Total Views: 44 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *