డిఎస్పి

కోవిడ్ నిబంధనలు పాటించండి :  కర్నూలు టౌన్ డిఎస్పి కె.వి.మహేష్

క్రైమ్

కోవిడ్ నిబంధనలు పాటించండి : కర్నూలు టౌన్ డిఎస్పి కె.వి.మహేష్

-: మాస్కులు పంపిణీ చేసిన డీఎస్పీ
 
కర్నూలు క్రైమ్,  ఏప్రిల్ 17 , (సీమ కిరణం న్యూస్) :
 రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు నమాజ్  సమయంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని డిఎస్పి కె.వి.మహేష్ సూచించారు. స్థానిక నంద్యాల చెక్ పోస్ట్ సమీపంలోని మూసా మసీదు లో శనివారం డీఎస్పీ చేతుల మీదుగా ముస్లిం సోదరులకు మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం వారితో పాటు నమాజు లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్ సాయంతో తరచు చేతులు శుభ్రపరచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మూడో పట్టణ సీఐ తబ్రేజ్ పాల్గొన్నారు.

Total Views: 40 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *