జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్

వెల్దుర్తి లో ప్రజలకు మాస్కులు అందజేసిన కర్నూలు జిల్లా ఎస్పీ

క్రైమ్

కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి….

జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ 

కరోనా ను అరికట్టడానికి  ప్రజలు ఖచ్చితంగా మాస్కులు ధరించాలి.

కర్నూలు క్రైమ్,  ఏప్రిల్ 17 , (సీమ కిరణం న్యూస్) :

శనివారం వెల్దుర్తి పాత బస్టాండ్  లో  మాస్కులు ధరించని  ప్రజలకు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ మాస్కులు  అందజేశారు.
కరోనా కేసులు పెరుగుతున్న సంధర్బంగా గౌరవ డిజిపి గారి ఆదేశాల మేరకు  జిల్లా వ్యాప్తంగా 87 పోలీసు స్టేషన్ ల పరిధులలో మాస్కులపై  అవగాహన కల్పిస్తున్నామన్నారు. కరోనా టీకా ఆవశ్యకత , దాని ప్రాముఖ్యత గురించి పోలీసు అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడతున్నారన్నారు.  ప్రజలు  బౌతిక దూరం పాటించాలన్నారు. శానిటైజర్ లు వినియోగించాలన్నారు. మాస్కులు లేకుండా తిరిగే వారిపై ఈ – చలాన్ లు వేస్తున్నామన్నారు.
ప్రతి ఒక్కరూ  కోవిడ్ నిబంధనలకు లోబడి ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు డోన్ డిఎస్పి నరసింహారెడ్డి ,డోన్ సిఐ మహేశ్వరరెడ్డి, వెల్దుర్తి ఎస్ఐ పెద్దయ్య నాయుడు   ఉన్నారు. 

Total Views: 42 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *