-: మహిళా డిఎస్పీ వెంకట రామయ్య

దిశా యాప్ తోనే మహిళలకు రక్షణ : మహిళా డిఎస్పీ వెంకట రామయ్య

క్రైమ్

దిశా యాప్ తోనే మహిళలకు రక్షణ

-: మహిళా డిఎస్పీ వెంకట రామయ్య

కర్నూలు క్రైమ్, ఏప్రిల్ 17 , (సీమ కిరణం న్యూస్) :

బాల్య వివాహాలు, చిన్న పిల్లలపై జరిగే లైంగిక నేరాలు, స్త్రీలపై జరిగే అత్యాచారాలు వంటి ఆపద సమయాల్లో తక్షణమే రక్షణ పొందాలంటే వారికి సంబంధించిన సెల్ ఫోన్ లలో తప్పనిసరిగా దిశ యాప్ అందుబాటులో పంచుకోవాలని
మహిళా డిఎస్పీ వెంకట రామయ్య పిలుపునిచ్చారు.
శనివారం నగరంలోని ఏపీఎస్పీ క్యాంపు కట్టమంచి రామలింగారెడ్డి మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల లోని విద్యార్థులకు దిశ యాప్ సంబంధించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సుకు డీఎస్పీ
వెంకట రామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లా డుతూ ఎలాంటి ఆపద సమయాల్లో అయినా సరే దిశ యాప్ మీ వెంట ఉంటే రక్షణ మీవెంట ఉన్నట్లేనని తెలిపారు. సదస్సులో ఎస్సై శివ శంకర్ నాయక్, సిబ్బంది, పాఠశాల హెచ్ ఎం వెంకటరెడ్డి, సీనియర్ ఉపాధ్యాయురాలు సుగుణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Total Views: 40 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *