హత్యకు పాల్పడిన సంఘ విద్రోహులును కఠినంగా శిక్షించాలి

హత్యకు పాల్పడిన సంఘ విద్రోహులును కఠినంగా శిక్షించాలి

క్రైమ్

వెల్దుర్తి, జనవరి 04, (సీమ కిరణం న్యూస్) :

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం లోని స్థానిక పాత బస్టాండ్ నందు అడమ్స్ మిత్ హత్యకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి నవీన్ మాదిగ ర్యాలీ నిర్వహించారు. వీరితోపాటు సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టి.కృష్ణ,హెల్పింగ్ అండ్ సొసైటీ అధ్యక్షుడు హరి నరసింహ నాయుడు,ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు జి. మాధవ కృష్ణ,బాలరాజు,MRPS జిల్లా ఉపాధ్యక్షుడు టి. రాముడు,మాట్లాడుతూ ఆదోని నియోజకవర్గంలో నందవరం మండలం గురజాల గ్రామం లోని దళిత యువకుడు ఆడం స్మిత్ ప్రేమించి వివాహం చేసుకుంటే ఆ వ్యక్తిపై కొంతమంది దుండుగులు హత్యకు పాల్పడిన జరిగింది. హత్యకు పాల్పడిన దుండగులను వెంటనే పోలీసు యంత్రాంగం అరెస్టు చేయాలని ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఒకరికి ఉద్యోగం, 50 లక్షల ఎక్స్గ్రేషియా కల్పించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని వారన్నారు.రాష్ట్రంలో దళితులపై, మహిళలపై దాడులు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని తక్షణమే ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దుండగులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల నాయకులు టైలర్ రాముడు,రాజేష్, రాముడు, లోక్ సత్తా పార్టీ నాయకులు అల్లా బకాష్ వివిధ ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Total Views: 72 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *