ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి చేతుల మీదుగా ఇళ్లపట్టాల పంపిణీ

ఆంధ్రప్రదేశ్

వెల్దుర్తి, జనవరి 4,(సీమ కిరణం న్యూస్) :
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని అల్లు గుండు గ్రామంలో పేదలందరికీ నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు అనే అంశంలో భూమి పట్టా పంపిణీ కార్యక్రమంలో బాగంగా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మొదటగా భూమి పూజ చేసి మొక్కలు నాటింది.తదుపరి పేదల కష్టాలను పాదయాత్ర ద్వారా తెలుసుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారని అందులో భాగంగానే కర్నూల్ జిల్లాకు 2.07 లక్షల మందికి పేదలకు ఇళ్ళ స్థలాల పట్టాలు ఇచ్చారని, పత్తికొండ నియోజకవర్గానికి దాదాపుగా 8000వేల ఇళ్లను మంజూరు చేశామని, ఇళ్లు రాని లబ్ధిదారులకు కూడా మళ్ళీ రెండో విడత కింద మంజూరు చేస్తామనీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తెలిపారు. అంతేకాకుండా డి.ఇ. గురుస్వామి ద్వారా ఇంటికి అయ్యే ఖర్చు విడతలవారీగా విడుదల అయ్యే విషయాన్ని విశదీకరించారు మరియు ఇక్కడున్న ఇళ్ల పట్టాలకు నీటి సౌకర్యం ముందుగానే శాంక్షన్ అయిందని తెలిపారు .ఇళ్ల పట్టాలు పంపిణీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తర్వాత మిగిలిన ఇళ్ల పట్టాలను మండల తహశీల్దార్ రాజేశ్వరి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో
వైయస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి,
ఎమ్మెల్యే గారి తనయుడు యువ నాయకులు కంగాటి రామ్ మోహన్ రెడ్డి, స్పెషల్ కలెక్టర్ రామస్వామి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీ వాణి, హౌసింగ్ డి.ఇ. గురు ప్రసాద్, మండల తహశీల్దార్ రాజేశ్వరి , మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఈ.వి.సుబ్బారెడ్డి, ఈ.ఒ.ఆర్.డి. నరసింహులు,
వైఎస్సార్ పార్టీ వెల్దుర్తి మండల కన్వీనర్ రవి రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు సమీర్ కుమార్ రెడ్డి ,అల్లు గుండు గ్రామ వైఎస్సార్ పార్టీ నాయకులు శ్రీ రామ్ రెడ్డి, ఆర్ఐ అబ్దుల్ కలాం ,గ్రామ రెవెన్యూ అధికారులు మహేష్ ,మద్దిలేటి, ఉమ్మన్న, ఎల్ల రాముడు, ఆనంద్, రాఘవేంద్ర, సతీష్ ,రఘు, మల్లె పల్లె అనంత్ రెడ్డి ,అల్లుగుండు గోపి, అల్లు గుండు భాస్కర్ నాయుడు, బొమ్మిరెడ్డి పల్లె మధుసూదన్ రెడ్డి, చక్రపాణి రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, పట్టణ కన్వీనర్ వెంకట నాయుడు మరియు సచివాలయ సిబ్బంది అధికారులు,వాలంటీర్లు వెల్దుర్తి మండల వైఎస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

Total Views: 54 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *