జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయాలి : నగర ప్రధాన కార్యదర్శి నాగేంద్ర

ఆంధ్రప్రదేశ్

అక్రిడేషన్ కమిటీలో జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి

ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా

కర్నూలు కలెక్టరేట్ జనవరి 11 (సీమ కిరణం న్యూస్) :

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఏపీడబ్ల్యూజేఎఫ్ నగరకమిటి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ ధర్నాను ఉద్దేశించి నగర ప్రధాన కార్యదర్శి నాగేంద్ర,జిల్లా నాయకులు చంద్రమోహన్,అశోక్ కుమార్ లు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ధర్నాలు జరుగుతున్నాయని అర్హులైన జర్నలిస్టులందరికీ ఆక్రెడేషన్ కార్డులు , బస్ పాసులు తక్షణం ఇవ్వాలని , అక్రిడేషన్ కమిటీ లోకి జర్నలిస్టు ప్రతినిధులను తీసుకోవాలని , కరోనా వ్యాధికి గురైన జర్నలిస్టులకు రూ . 25,000 తక్షణ ఆర్థిక సహాయం అందించాలన్నారు. అలాగే అర్హులైన జర్నలిస్టులకు ఇంటిస్థలాలు కేటాయించాలని , జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిసు పెడరేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందన్నారు.చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు చేయలేదని మీడియా గొంతు నొక్కడం సరైన నిర్ణయం కాదన్నారు.జిఎస్టీ ల పేరుతో 142 జి.ఓ ల పేరుతో అక్రిడేషన్ లను కొత్త పెట్టి జర్నలిస్టుల హక్కులు కాలరాస్తున్నారన్నారు.ఇప్పటికైనా ప్రతి జర్నలిస్ట్ కు అక్రిడేషన్ ను మంజూరుచేవలన్నారు.లేని పక్షం లో జర్నలిస్టుసంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమాన్నీ చేపడతామన్నారు.ఇప్పటికే అక్రిడేషన్ లు లేక,బస్ పాస్ లు లేకపోవడం తో గ్రామీణ ప్రాంత జర్నలిస్టులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు.ఆర్ యన్ ఐ ఉన్న ప్రతి పత్రికకు వారి పరిస్థితులు బట్టి కనీసం ఒక అక్రిడేషన్ కార్డును అయిన మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.జర్నలిస్ట్ లకు అన్యాయం చేసిన ఏ ప్రభుత్వం నిలువలెదని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు విజయ కరణ్,స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా నాయకులు సునీల్ కుమార్,అవినాష్, నగర సహాయ కార్యదర్శులు ఏసుదాస్,రమేష్, నాయకులు రవి బాబు,బ్రహ్మయ్య,వెంకటేష్,శ్రీరాములు,అడ్డాకుల శీను, సైఫుల్లా, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

Total Views: 44 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *