కోచ్‌ జ్వాలా రెడ్డి

‘సీటీ మార్‌’ కోసం కబడ్డీ కోచ్‌ అయ్యారు తమన్నా. ప్రత్యర్థి టీమ్‌కి దొరక్కుండా తన టీమ్‌ను తయారు చేసే కోచ్‌ పాత్రలో ఆమె కనిపిస్తారు. గోపీచంద్, తమన్నా జంటగా సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సీటీమార్‌’. సోమవారం తమన్నా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఆమె లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో జ్వాలా రెడ్డిగా నటిస్తున్నారామె. గోపీచంద్‌ కూడా కబడ్డీ కోచ్‌ పాత్రలోనే కనిపిస్తారు. సోమవారం సెట్లో తమన్నా పుట్టిన రోజును కూడా […]

Continue Reading

అందరికీ కృతజ్ఞతలు: అభిజీత్‌

ఒక విజయం కోసం 105 రోజుల ఎదురుచూపు, రోజూ పిల్లలాటలు, కుమ్ములాటలు. అలకలు, బుజ్జగింపులు, ఎలిమినేషన్‌లు, వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలు… కొన్ని రాజీల మధ్య బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ కూడా పూర్తయింది. విజేత అభిజీత్‌. కంటెస్టెంట్‌లందరూ ఇన్ని రోజులు ప్రేక్షకుల ఇళ్లలో ఒకరిగా కలిసిపోయారు. ఒక్కో కంటెస్టెంటూ వెళ్లిపోతుంటే హౌస్‌లో ఉన్న తోటి కంటెస్టెంట్‌లతోపాటు ప్రేక్షకులు కూడా బాధపడ్డారు. ఇన్ని అడ్డంకులనూ దాటుకుని విజేతగా నిలిచిన అభిజీత్‌కు తెర ముందు కనిపించే ప్రశంసలతోపాటు తెర వెనుక కూడా ప్రశంసలు […]

Continue Reading

సునీత ప్రివెడ్డింగ్‌.. హాజరైన రేణు దేశాయ్‌

హైదరాబాద్‌: ఇటీవల సింగర్‌ సునీత కు వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అంతేగాక జనవరిలో రామ్‌ను వివాహం చేసుకుంటున్నట్లు సునీత వెల్లడించారు. ఈ నేపథ్యంలో పెళ్లి సమయం దగ్గరపడుతుండటంతో వీరిద్దరూ ప్రివెడ్డింగ్ కార్యక్రమాన్ని ఆదివారం‌ జరుపుకున్నారు. గచ్చిబౌలిలోని ఓ స్టార్‌ హోటల్‌లో‌ ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ నటీనటులతో పాటు టాప్‌ సింగర్స్‌ హజరయ్యారు.

Continue Reading

సినీ పరిశ్రమలో విషాదం : క్రిస్మస్‌ స్టార్ కడుతూ

ప్రముఖ మేకప్ మ్యాన్‌, మలయాళ హీరో నివిన్‌ పాలీ వ్యక్తిగత మేకప్‌ ఆర్టిస్ట్ దుర్మరణం ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. నివిన్‌ పర్సనల్‌ మేకప్‌మేన్‌ షాబు పుల్పల్లి (37) ప్రమాదవశాత్తూ ఆదివారం కన్నుముశారు. క్రిస్మస్‌ స్టార్‌ను వేలాడదీసేందుకు చెట్టు ఎక్కిన షాబు అకస్మాత్తుగా అదుపు తప్పి కిందపడిపోయారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి నప్పటికీ షాబూని రక్షించలేకపోయామని ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఫెఫ్కా) డైరెక్టర్స్ యూనియన్ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా వెల్లడించింది

Continue Reading