ఖజానాకు మరో రూ. 1,500 కోట్లు!

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాల నిమిత్తం సెక్యూరిటీ బాండ్ల వేలం కొనసాగుతోంది. కరోనా కష్టకాలంలో ప్రభుత్వాన్ని ఆదుకున్న బాండ్ల వేలంలో భాగంగా మంగళవారం రూ. 1,500 కోట్లు ఆర్‌బీఐ వేలం ద్వారా సమకూరనున్నాయి. ఈ మేరకు ఆర్‌బీఐ తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 11,407 కోట్ల విలువైన బాండ్లను వేలానికి పెట్టింది. ఇందులో సాధారణ వేలం కింద రూ. 1,500 కోట్లు, గ్రీన్‌ షూ ఆప్షన్‌ కింద మరో రూ. 500 కోట్లు సమీకరించుకొనే అవకాశం కల్పిస్తూ […]

Continue Reading

లెక్చరర్ల బదిలీలపై మంత్రి సబిత ఆగ్రహం

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు (టీఆర్‌టీ) నిర్వహించడానికి కంటే ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించేలా పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. టెట్‌ నిర్వహించకుండా పోస్టులను భర్తీ చేస్తే అభ్యర్థుల నుంచి ఆందోళన వ్యక్తమయ్యే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ముందుగా టెట్‌ నిర్వహించడంపై విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాగా, ప్రస్తుతం ఉపాధ్యాయ ఖాళీలు 8వేల వరకు ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. అయితే వాటిల్లోనూ మార్పులు ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. […]

Continue Reading

భూమి పొరల్లో మాగాణి.. సింగరేణి..

బొగ్గు నిల్వల గుర్తింపు, ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి లెక్కిస్తే 131 ఏళ్ల చరిత్ర సింగరేణి సొంతం. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థగా గుర్తింపు పొందింది. మూడు తరాల కార్మికుల చెమట చుక్కలకు ప్రత్యక్ష నిదర్శనం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.వందల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టింది. జియోలాజికల్‌ సర్వే ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఆరు జిల్లాలో గోదావరితీరంలో 22,207 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించింది. ఇప్పటివరకు 1,500 మిలియన్‌ టన్నులకు పైగా బొగ్గును వెలికితీశారు. మరోవైపు […]

Continue Reading

సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వచ్చినప్పుడు భేటీ అవుతా

హైదరాబాద్‌: భాగ్యనగరం చుట్టూతా ఉన్న ప్రధాన పట్టణాలను అనుసంధానించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రీజనల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ప్రాజెక్టును కొలిక్కి తెచ్చేందుకు కృషి చేస్తానని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. జాతీయ రహదారుల్లో భాగంగా ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణానికి కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు రాని కారణంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు గురించి సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు మాట్లాడుతానన్నారు. తెలంగాణవ్యాప్తంగా నిర్మించిన ఆరు జాతీయ రహదారులను గడ్కరీ సోమవారం […]

Continue Reading