
పవన్ కల్యాణ్ పెద్దన్న పాత్ర పోషించాలి
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆసక్తికర వ్యాఖ్యలు
విజయవాడ/ సీమకిరణం న్యూస్ :
ఆంధ్రప్రదేశ్‌లోని తణుకులో ఇవాళ కాపునాడు సమావేశం నిర్వహించారు. కాపుల సమస్యలపై త్వరలోనే జేఏసీ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా బొండా ఉమా, ఆకుల రామకృష్ణ, సూరెడ్డి విష్ణు అన్నారు. త్వరలో అన్ని జిల్లాల్లో ఈ జేఏసీ కాపునాయకులతో సమావేశం అవుతుందని చెప్పారు. కాపులు ఆంధ్రప్రదేశ్‌లో పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ కల్యాణ్ చెప్పారని, ఇప్పుడు కాపుల సమస్యలపై పవన్ పెద్దన్న పాత్ర పోషించాలని వారు అన్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా కాపుల సమస్యపై ఎటువంటి పురోగతి లేదని చెప్పారు. గతంలో కాపుల కోసం చంద్రబాబు కాపు కార్పొరేషన్ పెట్టి కాపులను ఆదుకున్నారని వారు తెలిపారు. ఏపీలో కాపులు అతిపెద్ద కులం అని అన్ని పార్టీలకు తెలుసని అన్నారు. త్వరలో అన్ని జిల్లాల కాపునాయకులతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలుస్తామని చెప్పారు.




