
బీహార్ కు చెందిన ట్రావెల్ బస్సుకు 4,91,000 జరిమానా
డోన్ మోటారు వాహనముల తనిఖీ అధికారి టీ క్రాంతి కుమార్
డోన్ , డిసెంబర్ 08, (సీమకిరణం న్యూస్):
బీహార్ కు చెందిన ట్రావెల్ బస్సును ఆన్లైన్లో తనిఖీ చేయగా రోడ్డు టాక్స్ లేదని గుర్తించి 4,91,000 జరిమానా విధించినట్లు డోన్ మోటారు వాహనముల తనిఖీ అధికారి టీ క్రాంతి కుమార్ తెలిపారు. సోమవారం వాహన తనిఖీల నిమిత్తం డోన్ హైవే లో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బీహార్ కు చెందిన ట్రావెల్ పాయింట్ ట్రావెల్స్ కు సంబందించిన బస్సు BR06PG7576 గోరకపూర్ నుండి అనంతపూర్ లో ప్రయాణికులను వదిలి తిరిగి అనంతపురం నుండి హైదరాబాద్ కు 7గురు ప్రయాణికులతో వెళుతుండగా బస్సును డోన్ సమీపములో ఆపగా డ్రైవర్ బస్సును ఆపకుండా అతివేగంగా నడుపుకుంటూ పారిపోవాడానికి ప్రయత్నించినట్టు బస్సును కారులో వెంబడించి జగదుర్తి సమీపంలో హైవే పై ఆపి బస్సు యొక్క పర్మిట్ చూపించమని డ్రైవర్ ను అడగ్గా బస్సు డ్రైవర్ చాలా దురుసుగా ప్రవర్తించి బస్సు పర్మిట్ చూపించడానికి నిరాకరించడంతో బస్సు యొక్క రికార్డులు ఆన్లైన్లో పరిశీలించగా రోడ్డు టాక్స్ లేదని గుర్తించి వాహనానికి రూ. 4,91,000/- లు జరిమానా విధించడం జరిగిందని డోన్ మోటారు వాహనముల తనిఖీ అధికారి టీ క్రాంతి కుమార్ తెలిపారు.




