ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATE

డీఐజి గా పదోన్నతి స్వీకరించిన విక్రాంత్ పాటిల్

డీఐజి గా పదోన్నతి స్వీకరించిన విక్రాంత్ పాటిల్

కర్నూలు జిల్లా జడ్జి , కర్నూలు రేంజ్ డిఐజి లను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డిఐజి విక్రాంత్ పాటిల్

అభినందనలు తెలిపిన జిల్లా జడ్జి , కర్నూల్ రేంజ్ డిఐజి

కర్నూలు క్రైమ్, జనవరి 01, (సీమకిరణం న్యూస్):

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎస్పీ స్థాయి నుండి డీఐజీ గా పదోన్నతి స్వీకరించారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా జడ్జి కబర్థి ని , కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ లను డిఐజి విక్రాంత్ పాటిల్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డీఐజీగా పదోన్నతి స్వీకరించిన విక్రాంత్ పాటిల్ కి జిల్లా జడ్జి , కర్నూలు రేంజ్ డిఐజి అభినందనలు తెలియజేశారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో విక్రాంత్ పాటిల్ ని అడిషనల్ ఎస్పీలు , డీఎస్పీలు, సిఐలు , ఆర్ ఐలు, ఎస్సైలు, ఆర్ ఎస్ ఐ లు , డిపిఓ మినిస్టిరియల్ సిబ్బంది , ఇతర శాఖల సిబ్బంది కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా ఎస్పీ గారి క్యాంపు కార్యాలయంలో డిఐజి విక్రాంత్ పాటిల్ , కర్నూల్ ఏపీఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెట్ దీపికా పాటిల్ కలిసి కుటుంబ సమేతంగా కేక్ కట్ చేసి స్పెషల్ బ్రాంచ్ సిబ్బందికి , క్యాంపు కార్యాలయంలోని సిబ్బందికి నూతన సంవత్సరo శుభాకాంక్షలు తెలిపారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS...RNI REGISTRATION NUMBER...RNI : APTEL/2018/76380.... S.K. NAZEER.FOUNDER , EDITOR & PUBLISHER.SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD.SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA |Telugu News | Latest News Online | Political News in Telugu | AndhraPradesh Latest News | AP Political News | Telangana News | TelanganaPolitics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!