
ద్విచక్రవాహనాల దొంగ అరెస్టు
కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్
42 బైక్ లు స్వాధీనం
కర్నూలు క్రైమ్, డిసెంబర్ 09, (సీమకిరణం న్యూస్):
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న వ్యక్తిని కర్నూలు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గత 10 రోజుల కింద కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ ద్విచక్ర వాహనం కనబడకుండా పోవడంతో కర్నూలు 3వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేసిన కర్నూల్ పోలీసులు అనంతపురం జిల్లా కక్కలపల్లికి చెందిన పోతుల జాన్ (29) ( తండ్రి పేరు పోతుల జాకబ్) దొంగలించినట్లు గుర్తించారు. పోతుల జాన్ ను విచారించగా మొత్తం 42 ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసినట్లు గుర్తించారు. 42 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్ తెలిపారు. ఆసుపత్రిలో హాడావిడిగా ఉన్న వ్యక్తుల వాహనాలపై నిందితుడు పోతుల జాన్ ను దృష్టి పెట్టి వారి వాహనాలు దొంగలించేవాడని కర్నూల్ డిఎస్పీ తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో కర్నూలు డిఎస్పీ గారితో పాటు కర్నూలు మూడవ పట్టణ సిఐ శేషయ్య, ఎస్సై ఆశాలత, ఎఎస్సై గిడ్డయ్య, హెడ్ కానిస్టేబుల్ వాసు, రంగరావు, కానిస్టేబుల్స్ శేఖర్, నాగరాజు , కిశోర్ ఉన్నారు.




